కిడ్నాప్ కేసులో మైత్రీ మూవీస్ అధినేత

కిడ్నాప్ కేసులో మైత్రీ మూవీస్ అధినేత

ఫోన్ ట్యాపింగ్​ వ్యవహారంలో మరో ట్విస్ట్​ చోటు చేసుకుంది. చెన్నుపాటి వేణుమాధవ్ నుంచి  రూ.40 కోట్లు విలువ చేసే షేర్లు రాయించుకున్నారనే కేసులో మైత్రీ మూవీస్ అధినేత నవీన్ ఏర్నేని పేరు తెరపైకి వచ్చింది.

హైదరాబాద్, వెలుగు: టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. క్రియా హెల్త్ కేర్ ఫౌండర్ చెన్నుపాటి వేణుమాధవ్ నుంచి కిడ్నాప్, బెదిరింపులతో రూ.40 కోట్లు విలువ చేసే షేర్లు రాయించుకున్నారనే కేసులో ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, మైత్రీ మూవీస్ అధినేత నవీన్ ఏర్నేని పేరు తెరపైకి వచ్చింది. గత మంగళవారం జూబ్లీహిల్స్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో నవీన్ ఏర్నేని పేరు కూడా నిందితుల జాబితాలో చేర్చారు. 

అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రాధాకిషన్ రావు ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నాడు. 9 మంది నిందితుల్లో టాస్క్ ఫోర్స్ మాజీ ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు, నవీన్ సహా మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది.