గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుతో 33 కోట్ల మందికి లబ్ధి: గౌతంరావు

గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుతో  33 కోట్ల మందికి లబ్ధి:  గౌతంరావు

ముషీరాబాద్/కూకట్​పల్లి, వెలుగు: కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరపై రూ.200 తగ్గించడంతో దేశంలోని 33 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు ఎన్. గౌతంరావు తెలిపారు. గురువారం బర్కత్​పురాలోని బీజేపీ సిటీ ఆఫీసు వద్ద ప్రధాని మోదీ ఫొటోకు ఆయన పాలాభిషేకం చేశారు. 

సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయంపై  బీజేపీ శేరిలింగంపల్లి సెగ్మెంట్ ఇన్​చార్జి గజ్జెల యోగానంద్ హర్షం వ్యక్తం చేశారు. వివేకానందనగర్  డివిజన్​లో ప్రధాని మోదీ ఫొటోకు పాలాభిషేకం చేశారు.