
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి ఉండదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లిస్తుందని ఆయన ఆరోపించారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం 8 వేల కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 500 కోట్లు మాత్రమే డబల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఖర్చు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వానంగా తయారైందని, పఠాన్ చెరువులో..400 స్టూడెంట్స్ ఉన్న కాలేజీలో ఒక్కే ఒక్క రూమ్ ఉందన్నారు. అనేక కాలేజీలో కనీస వసతులు లేవన్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఫ్యాకల్టీ లేదని చెప్పారు. కౌన్సిల్ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గళం కావాలని,అందుకు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో AVN రెడ్డిని గెలిపించాలని కోరారు. V6, వెలుగు దినపత్రిక నిజాలు చూపిస్తే బెదిరిస్తున్నారని, నిజాలు చూపించే ఛానల్ వీ6 న్యూస్ అని వెల్లడించారు.