దమ్ముంటే బైపోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రండి ..సీఎం రేవంత్ రెడ్డికి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రాంచందర్ రావు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దమ్ముంటే బైపోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రండి ..సీఎం రేవంత్ రెడ్డికి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రాంచందర్ రావు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరిన ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ప్రజాతీర్పును ఎదుర్కోవాలని డిమాండ్
  • దానంపై అనర్హతను సుప్రీంకోర్టు సమర్థించడం ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితో వెంటనే రాజీనామాలు చేయించాలని, దమ్ముంటే ఉప ఎన్నికలకు వచ్చి ఎవరేంటో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్.రాంచందర్ రావు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.

ఈ మేరకు గురువారం ఆయన దుబాయ్ నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. రాజ్యాంగ ద్రోహానికి పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు బీజేపీ శాసనసభా పక్షం చేసిన రాజీలేని న్యాయపోరాటంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. చట్టసభలు ఆయారాం, గయారాంలకు అడ్డా కాకూడదని, ఘర్ వాపసీల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేరని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ అధికార అహంకారానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు.

ఇదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై కోర్టుల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కంచె చేను మేసిన వైనాన్ని తలపిస్తోందని ఆయన తెలిపారు. స్పీకర్ కార్యాలయాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా లబ్ధి పొందాలని ఎంత ప్రయత్నించినా, న్యాయం ముందు ఎవరూ తప్పించుకోలేరన్నారు.

దేశమంతా తిరుగుతూ చేతిలో రాజ్యాంగ ప్రతి పట్టుకుని సంవిధాన్ బచావో అని రాహుల్ గాంధీ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మరో పార్టీ బీ-ఫారంతో గెలిచిన ఎమ్మెల్యేను చేర్చుకొని, ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి మరీ పోటీ చేయించడం రాహుల్ గాంధీ నయవంచనకు, కాంగ్రెస్ కపట రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.