
న్యూఢిల్లీ: ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా ఉన్న ఆయన.. ఎయిర్ మార్షల్ ఎస్పీ ధర్కర్ స్థానంలో నియమితులయ్యారు.
ఢిల్లీలోని వాయు భవన్‌లో శుక్రవారం బాధ్యతలు చేపట్టిన తివారీ.. సిబ్బంది నుంచి గౌరవ వందనం అందుకున్నారు. తివారీ గొప్ప ఫైటర్ పైలట్. 3,600 గంటల ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆయన సొంతం. 1986లో ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన తివారీ.. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు.