
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో 95వ వేడుకల్లో ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్‌ను గెల్చుకుంది. నాటు నాటు పాటకు పురస్కారం వచ్చిన తర్వాత నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. 10 రెట్లు ఎక్కవగా సెర్చ్ చేసినట్లు జపాన్‌కు చెందిన ఓ సంస్థ తన రిపోర్టులో తెలిపింది. 1,105 శాతం సెర్చ్‌తో నాటు .. రికార్డు క్రియేట్ చేసిందని పేర్కొంది.
అలాగే టిక్‌టాక్‌లోనూ అవార్డు తర్వాత 50 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్చేయగా ఇతర దేశాల్లో టిక్‌టాక్ అందుబాటులోనే ఉంది. ఈ పాటను 90 నెలలో పూర్తి చేయగా మిగతా 10 శాతం కోసం 19 నెలల సమయాన్ని తీసుకున్నానని లిరిక్ రైటర్ చంద్రబోస్ ఇటీవల తెలిపారు.