
గండిపేట, వెలుగు : రైతు దైవంతో సమానమని, వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు నాబార్డ్ నిరంతరం కృషి చేస్తుందని నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని విస్తరణ విద్యాసంస్థలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీవో) బలోపేతం చేసేందుకు నాబార్డు సాయంతో రాజేంద్రనగర్ అగ్రి కాలేజీ ఒక ప్రాజెక్టును అమలు చేస్తుండగా.. కొనుగోలు, అమ్మకందారుల మొదటి సమావేశం ఈఈఐలో జరిగింది.
కొత్త టెక్నాలజీకి తగ్గట్లుగా ఎఫ్‌పీవోలు మారాలని సూచించారు. వర్సిటీ విస్తరణ డైరెక్టర్ వి. సుధారాణి, వర్సిటీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ సీమ, మేనేజ్ డైరెక్టర్ గుమ్మ గోలిమత్, అగ్రి కాలేజీ అసోసియేషన్ డీన్ సి. నరేంద్రరెడ్డి, డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ మధుబాబు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలోక ఎవర్ గ్రీన్ ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధి ప్రసాదరావు పాశం, మార్కెటింగ్ శాఖ సిబ్బంది, ఎఫ్‌పీవోలు, రైతులు, మహిళా రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.