బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా నియామకం

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా నియామకం

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా నియమితులయ్యారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి నడ్డా పేరును ఖరారు చేస్తూ సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్..అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ చాలా ఎన్నికలు గెలిచింది. ఆయన్ను హోంమంత్రిగా నియమిస్తూ మోడీ నిర్ణయం తీసుకోవడంతో..పార్టీ బాధ్యతల్ని మరకరికి అప్పగించాలని నిర్ణయించాం అన్నారు. ఈ క్రమంలోనే జేపీ నడ్డాను సెలక్ట్ చేశామని తెలిపారు రాజ్ నాథ్ సింగ్.