
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఈ మధ్యాహ్నం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా .. నాదెండ్లకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నాదెండ్ల భాస్కర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెలరోజుల పాటు సీఎంగా పనిచేశారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్నికూల్చి.. ఆగస్ట్ 16 నుంచి నెలరోజుల పాటు ఏపీ సీఎంగా ఉన్నారు.
నాదెండ్లతో పాటు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్‌రెడ్డి, మెదక్ జిల్లా మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, చాడా సురేశ్‌రెడ్డి, నిర్మాత బెల్లంకొండ రమేశ్, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్ ఇతరులు అమిత్ షా ఆధ్వర్యంలో మరోసారి బీజేపీలో చేరారు. వీరందరూ షా చేతులమీదుగా పార్టీ సభ్యత్వాలను తీసుకున్నారు. శంషాబాద్‌లోని KLCC హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మురళీధర్ రావు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ, రాజాసింగ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.