
నాగచైతన్య, సమంత విడిపోయి ఏళ్లు గడుస్తున్న వారిద్దరిపై వార్తలు మాత్రం ఆగడంలేదు. ఏదోరకంగా వీరిద్దరిపై వార్తలు కుప్పలు కప్పలుగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన ఇంకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే..
విజయ్ దేవరకొండ, సమంత మొయిన్ లీడ్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషి. 2023 సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఓ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లిన నాగచైతన్య మూవీ బ్రేక్ టైమ్ లో ఖుషి ట్రైలర్ రాగానే థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే ఈ వార్తలపై చైతూ క్లారిటీ ఇచ్చాడు. అవన్నీ చెత్త వార్తలని కొట్టిపారేశారాయన. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్న చైతూ.. . కొన్ని తెలుగు వెబ్‌సైట్స్‌లో రూమర్స్ తన దృష్టికి వచ్చాయని, ఆ వార్తలను సరిచేయాల్సిందిగా ఇప్పటికే వాళ్లకు సూచించామని అన్నారు.
ఏమాయ చేశావో సినిమాలో మొదటిసారి కలిసి నటించిన చైసామ్.. ఆ తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో విడిపోతున్నట్లుగా ప్రకటించారు. ఆయనప్పటికీ ఇద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.