ఓటీటీలో కస్టడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

ఓటీటీలో కస్టడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య(Naga chaitanya) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ కస్టడీ(Custody). మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat Prabhu) తెరకెక్కించిన ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ కృతి శెట్టి(kruthi Shettty) హీరోయిన్ గా నటించింది. 

భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు మినిమమ్ కలెక్షన్స్ కూడా రాలేదు. ఇక థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్(Ott release) చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఈ సినిమా జూన్ 9 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి థియేటర్ లో మెప్పించలేకపోయిన ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో  చూడాలి.