100% లవ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

100% లవ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

హిట్స్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ ఉంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.  రీసెంట్‌గా చై కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా.. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన మేర సక్సెస్‌ కాలేకపోయింది. ఈ సినిమాపై నాగ చైతన్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా చై ఆశల్ని తీర్చలేకపోయింది. దీంతో మరి డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక ఈ ఫ్లాప్ నుండి త్వరగా బయట పడటానికి మరో సినిమాను మొదలుపెట్టనున్నాడు చైతన్య. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నాగచైతన్య తన తరువాత మూవీని చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇదే విషయాన్ని తాజాగా నిర్మాత బన్నీ వాసు కూడా కన్‌ఫర్మ్‌ చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాదిలోనే GA2  బ్యానర్‌లో నాగచైతన్యతో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కు డైరెక్టర్‌ ఎవరన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపాడు. 

దీంతో అక్కినేని అభిమానులు హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. గతంలో  గీతా ఆర్ట్స్‌లో చై నటించిన  '100% లవ్' మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సెంటిమెంట్‌తో నెక్ట్స్‌ మూవీ కూడా హిట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ కి ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి మరి.