నాగచైతన్య నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘ధూత’. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించారు. పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను బుధవారం అనౌన్స్ చేశారు.
డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తోంది. ‘మిస్టరీనా లేక మెసేజా.. మీరు త్వరలోనే చూడబోతున్నారు’ అంటూ విడుదల చేసిన పోస్టర్లో నాగచైతన్య లుక్ ఇంప్రెస్ చేస్తోంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్తో సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో చైతు నటించాడు. మనం, థ్యాంక్యూ చిత్రాల తర్వాత నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ ఇది.