నాగ చైతన్య లవ్ స్టోరీ వాయిదా

V6 Velugu Posted on Apr 08, 2021

నాగ చైతన్య,సాయి పల్లవి జంట గా నటించిన లవ్ స్టోరీ సినిమా వాయిదా పడింది. ఏప్రిల్ 16న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాను వాయిదా వేస్తున్నట్లు.. సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల,హీరో నాగచైన్య నిర్మాతలు కలిసి సినిమా వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. అందుకే సినిమాను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.

లవ్ స్టోరీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలో చెబుతామన్నారు చిత్రయూనిట్.

Tagged sai pallavi, Naga Chaitanya

More News