రివ్యూ: మజిలీ

రివ్యూ: మజిలీ

రన్ టైమ్: 2 గంటల 34 నిమిషాలు

నటీనటులు: నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావురమేష్, పోసాని, సుబ్బరాజు, సుహాస్ తదితరులు

కథేంటి:

పూర్ణ (నాగచైతన్య) అన్షు (దివ్యాంశ) లవ్ చేసుకుంటారు. హీరోయిన్ కు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయినందున వీళ్ల ప్రేమకు హీరోయిన్ ఫాదర్ అడ్డుచెప్తాడు. వాళ్లు విడిపోవడంతో హీరో డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు..ఇష్టంలేకున్నా..తండ్రి (రావురమేష్) కోసం పక్కింటి అమ్మాయి శ్రావణి (సమంత) ను పెళ్లిచేసుకుంటాడు. కానీ ఆమెతో సరిగా కాపురం చేయడు..తర్వాత పూర్ణ అన్షు గురించి తెలుసుకున్నదేంటి? పూర్ణ,శ్రావణిలు ఎలా దగ్గరయ్యారనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

ఈ సినిమాలో నాగచైతన్య మ్యెచుర్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యంగ్ కుర్రాడిలా,మిడిల్ ఏజ్ పర్సన్ లాగా రెండు షేడ్స్ లోనూ పరిణితితో కూడిన నటనతో మెప్పించాడు. సమంత మరోసారి మంచి నటనతో ఇంప్రెస్ చేసింది. కొత్త హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ ఫర్వాలేదనిపించింది. రావురమేష్,పోసాని, సుబ్బరాజు,సుహాస్ లు బాగా చేశారు.

టెక్నికల్ టీమ్ వర్క్:

విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది. వైజాగ్ ను అందంగా చూపించాడు. గోపిసుందర్ పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి..,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ ను బాగా క్యారీ చేసింది. శివ నిర్వాణ రాసుకున్న సంభాషణలు హృద్యంగా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది.

విశ్లేషణ

మజిలీ మూవీ ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ..ప్రేమలోని సున్నితమైన అంశాలను టచ్ చేసి ఇంప్రెస్ చేశాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ఫస్టాఫ్ ఫన్ లవ్ స్టోరీగానూ..సెకండాఫ్ ఎమోషనల్ గా నడిపించాడు..అన్నీ సీన్లు ఆకట్టుకుంటాయి.నటీనటుల ప్రతిభ,డైరెక్టర్ రచన, టెక్నీషియన్స్ వర్క్ ఈ సినిమా కు పెద్ద ప్లస్. కాస్త స్లోగా సాగుతున్నట్టు అనిపించినా..కథలో ఫీల్ ఉంది కాబట్టి ఆడియన్స్ బాగా కనెక్టవుతారు. ఈ వీకెండ్ సినిమా చూడాలనుకుంటే మజిలీ మంచి ఆప్షన్.

బాటమ్ లైన్: మనసుకు హత్తుకునే మజిలీ.