మనిషిగా ఎలా ఉండాలో చూపించినందుకు 'థాంక్యూ'

మనిషిగా ఎలా ఉండాలో చూపించినందుకు 'థాంక్యూ'

అక్కినేని హీరో నాగచైతన్య  అప్ కమింగ్ మూవీ 'థాంక్యూ'. ఈ నెల(జులై) 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మూవీ  ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్న  చైతూ  తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ  పోస్ట్ పెట్టాడు.  తనకు అత్యంత ముఖ్యమైన వారికి థాంక్యూ చెప్పాడు. " థాంక్యూ అనే పదాన్ని  ఎక్కువగా వాడుతుంటా.. ఈ ఆలోచనకు థాంక్యూ చిత్రం కారణం. ఈ మూవీ జర్నీ నన్ను కదిలించింది " అంటూ తన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులకు అంకితం ఇస్తున్నట్లుగా తెలిపాడు. ఈ పోస్ట్ లో తన తల్లిదండ్రులైన నాగార్జున, లక్ష్మి దగ్గుబాటి తన పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఫోటోలను అందులో షేర్ చేశాడు.

'అన్ని విషయాల్లో నాకు సపోర్ట్‌ చేస్తూ నాపై అంతులేని ప్రేమను చూపించిన అమ్మకు థ్యాంక్స్‌', 'నాకు తోడుగా నిలిచినందుకు, స్నేహితుడిగా ఉన్నందుకు నాన్నకు 'థ్యాంక్స్ 'ఎలా ప్రేమించాలో, మనిషిగా ఎలా ఉండాలో చూపించినందుకు థ్యాంక్స్‌ హ్యాష్‌' అంటూ ఎమోషనల్‌ గా రాసుకొచ్చాడు.  రాశీ ఖన్నా  హీరోయిన్ గా నటిస్తోన్న థాంక్యూ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, -శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా పైన మంచి అంచనాలున్నాయి. అటు అమీర్ఖాన్, కరీనా కపూర్‌ల లాల్ సింగ్ చద్దా మూవీతో చైతూ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 11న సినిమా విడుదల కానుంది.