మత్స్యకారులతో వేటకు వెళ్లిన నాగచైతన్య.. అతని జీవితమే ఆధారం

మత్స్యకారులతో వేటకు వెళ్లిన నాగచైతన్య.. అతని జీవితమే ఆధారం

అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) గత రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లా సముద్రతీరంలో సందడి చేస్తున్నాడు. అంతేకాదు అక్కడ మత్స్యకారులతో మాట్లాడి వారి జీవనశైలి గురించి తెలుసుకున్నాడు. వారితో కలిసి సముద్రంలో చేపల పట్టడానికి కూడా వెళ్ళాడు. ఇంతకీ ఇవన్నీ నాగచైతన్య ఎందుకు చేస్తున్నాడో  అనే అనుమానం చాలా మందికి రావొచ్చు.

అసలు విషయం ఏంటంటే..  2018లో గుజరాత్ కు చెందిన 21 మంది మత్స్యకారులు వేటకెళ్లి అనుకోకుండా పాక్ (Pakistan) కోస్ట్ గార్డ్స్  చేత్తోలో చిక్కుకున్నారు. దాదాపు 2 ఏళ్లపాటు పాకిస్తాన్ జైల్లోనే జీవితాన్ని గడిపారు ఆ మత్స్యకారులు. ఆతరువాత కొంతకాలానికి కేంద్రం సంప్రదింపులతో పాక్ చెరనుండి బయటబడ్డారు 21 మంది మత్స్యకారులు. వారిలో గణగల్ల రామరావు(Ganagalla Ramarao) కూడా ఒకరు. ఆ వ్యక్తి జీవితం ఆధారంగా నాగచైతన్య తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. అందుకే గణగల్ల రామరావు ఇంటికి వెళ్లి అతనితో ప్రత్యేకంగా మాట్లాడారు నాగచైతన్య. ఆ సంఘటనకు సమబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సినిమాని చందూ ముండేటి(Chandu mondeti) తెరకెక్కించనున్నారు.

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం నాగచైతన్య ఇప్పటికే హోమ్ వర్క్ కూడా మొదలై పెట్టేశాడు. సిక్కోలు, మత్స్యకారుల యాస, వారి వ్యవహారాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకునే పనిలో ఉన్నాడు నాగచైతన్య. గీత ఆర్ట్స్(Geetha arts) సంస్థ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే అధికారికంగా మొదలుకానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.