జులై 3న నాగబంధం రిలీజ్

జులై 3న  నాగబంధం  రిలీజ్

 విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. ఈ మైథలాజికల్ అడ్వెంచర్‌‌‌‌ మూవీని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,  టీజర్, సాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. గురువారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు.  జులై 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల  చేయనున్నారు. 

ఈ అనౌన్స్‌‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో   రెండు రకాల గెటప్స్‌‌లో  హీరో విరాట్ కనిపిస్తున్నాడు.  పై భాగంలో శివుడిగా  పవర్‌‌‌‌ఫుల్ లుక్‌‌లో కనిపిస్తుండగా, కింది భాగంలో మోడ్రన్ లుక్‌‌లో చాలా స్టైలిష్‌‌గా కనిపిస్తున్నాడు.  ఈ రెండు లుక్స్‌‌తో డిజైన్ చేసిన పోస్టర్ ఆడియెన్స్‌‌‌‌లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.  ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.