విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. ఈ మైథలాజికల్ అడ్వెంచర్ మూవీని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మహేష్ బాబు విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లోనే 20 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. మైథాలజీ, చరిత్ర, ఆధ్యాత్మిక యుద్ధం, సంస్కృతి పరిరక్షణ, దైవిక రక్షణ లాంటి అంశాలతో వచ్చిన టీజర్‌కు ట్రెమండెస్ రెస్పాన్స్ రావడం ఆనందాన్ని కలిగిస్తోందని మేకర్స్ చెప్పారు.
అభిషేక్ నామా మేకింగ్, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, జునైద్ కుమార్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌తో టీజర్ విజువల్ ట్రీట్‌గా నిలిచింది. శివుడిగా, యోధుడిగా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో విరాట్ కర్ణ ఆకట్టుకున్నాడు.
నభా నటేష్, ఐశ్వర్య మీనన్, రిషబ్ సాహ్ని, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వేసవిలో పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
