చెంగ్డూ: ఇండియా టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆసియా–పసిఫిక్ వైల్డ్ కార్డ్ ప్లే ఆఫ్ టోర్నీలో బోణీ చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరోసీడ్ నగాల్ 2–6, 6–0, 6–2తో మింగ్‌హుయ్ జాంగ్ (చైనా)పై గెలిచి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు.
స్టార్టింగ్‌లో నెమ్మదిగా ఆడిన ఇండియన్ ప్లేయర్ తొలి సెట్‌ను చేజార్చుకున్నాడు. కానీ తర్వాతి రెండు సెట్లలో తన ట్రేడ్ మార్క్ ఆటతో రెచ్చిపోయాడు. బలమైన సర్వీస్‌లు, క్రాస్ కోర్టు షాట్లతో ప్రత్యర్థికి ఎక్కడా చాన్స్ ఇవ్వలేదు. ఫలితంగా రెండో సెట్‌లో ఒక్క గేమ్కూడా కోల్పోలేదు.
డిసైడర్‌లో జాంగ్ నుంచి కొద్దిగా ప్రతిఘటన ఎదురైనా నగాల్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ నెల 29 వరకు సిచువాన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ సెంటర్‌లో జరగనున్న ఈ టోర్నీలో గెలిచిన వాళ్లకు ఆస్ట్రేలియన్ ఓపెన్–2026కు వైల్డ్ కార్డు ఎంట్రీ లభిస్తుంది.
