ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్  బదావత్  సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నాగర్ కర్నూల్​ కలెక్టర్  బదావత్  సంతోష్  పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని జడ్పీ గ్రౌండ్​లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హెల్త్  వీక్  కార్యక్రమం ప్రారంభించారు. 

ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, పాలు, ప్రోటీన్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలని కోరారు. నూనె, ఉప్పు, చక్కెర వాడకాన్ని తగ్గించాలని సూచించారు. యువత ఫాస్ట్  ఫుడ్, జంక్  ఫుడ్ కు దూరంగా ఉండాలన్నారు. అడిషనల్  కలెక్టర్లు శ్యాంప్రసాద్, అమరేందర్,  ఇన్​చార్జి డీఎంహెచ్​వో రవికుమార్  పాల్గొన్నారు.