ఫిక్స్.. ఓటీటీలోకి నా సామిరంగ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు?

ఫిక్స్.. ఓటీటీలోకి నా సామిరంగ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు?

ఈ  ఏడాది  సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ గా నిలిచిన  సినిమాల్లో కింగ్ నాగార్జున నటించిన  నా సామిరంగ ఒకటి. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి  రాబోతుంది.  

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది.  అయితే ఎప్పటి నుంచి అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బహుశా ఫిబ్రవరి 12 లేదా 15 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. థియేటర్ల లో రూ. 50 కోట్లు సాధించిన ఈ మూవీని ఓటీటీ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. 

నా సామిరంగ మలయాళీ రీమేక్. విజయ్ బిన్నీ దర్శకుడు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు.  ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్  హీరోయిన్లుగా నటించారు.  కీరవాణి సంగీతం అందించారు.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేశారు.