ఎట్టకేలకు ఆ అభిమానిని కలిసిన నాగ్.... వీడియో వైరల్

 ఎట్టకేలకు ఆ అభిమానిని కలిసిన నాగ్....  వీడియో వైరల్

ముంబై ఎయిర్పోర్ట్ లో ఇటీవల తన బాడీ గార్డ్ ద్వారా నెట్టివేయబడిన అభిమానిని కలుసుకున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.  ముంబయి ఎయిర్‌పోర్ట్ నుంచి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా అత‌డిని క‌లుసుకున్నాడు నాగ్.  కలుసుకోవడమే కాకుండా అతనికి ఓ హగ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ  సందర్భంగా ఆ ఫ్యాన్ అనందం మాముులుగా లేదనే చెప్పాలి. 

ప్రస్తుతం నాగార్జున ముంబైలో కుబేర అనే మూవీ చేస్తున్నారు.  ఈ క్రమంలో ముంబై  ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న నాగ్ ను కలిసేందుకు ఈ ఫ్యాన్  ముందుకు వచ్చాడు. అయితే దీనిని గమనించిన నాగ్ బాడీ గార్డ్  ఒకరు అతన్ని పక్కకు నెట్టేశాడు. దీంతో అతను పడిపోయాడు. ఈ విషయం నాగ్ దృష్టికి రాలేదు. అయితే  ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా  వైరల్ కావడంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు నాగార్జున.  

వెంటనే క్షమాపణలు చెబుతూ భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగదని చెబుతూ ట్వీట్ లో వెల్లడించారు.  నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న మెయిన్ లీడ్ లో కుబేర చిత్రం తెరకెక్కుతుంది.  శేఖర్ కమ్ముల దర్శకుడుజ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే  విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకురుస్తున్నారు.