Geethanjali Re-Release: నాగార్జున 'గీతాంజలి' మళ్లీ వస్తోంది..37 ఏళ్ల తర్వాత 4Kలో క్లాసిక్ రీ-రిలీజ్!

Geethanjali Re-Release: నాగార్జున 'గీతాంజలి' మళ్లీ వస్తోంది..37 ఏళ్ల తర్వాత 4Kలో క్లాసిక్ రీ-రిలీజ్!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, గిరిజ నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం గీతాంజలి.  989లో వచ్చిన ఈ లవ్ ,  ఎమోషనల్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.  ప్రేక్షకుల నుంచే కాదు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. నాగార్జున కెరీర్ లోనే కాదు.. తెలుగు సినీ చరిత్రలోనే ప్రత్యక మూవీగా గుర్తింపును సొంతం చేసుకుంది. సరిగ్గా 37 ఏళ్ల క్రితం యువతను ఒక ఊపు ఊపిన ఈ ప్రేమకథ ఇప్పుడు 4K టెక్నాలజీతో కొత్త అనుభూతిని అందించబోతోంది. 

ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రాన్ని నవంబర్ 13, 2026న రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీస్ పద్గిని సినిమాస్ ఈ రీ-రిలీజ్‌ను నిర్వహిస్తోంది. 1989 మే 12న విడుదలైన 'గీతాంజలి' అప్పట్లో సాధారణ ప్రేమకథలా థియేటర్లలోకి రాలేదు. నాగార్జున–గిరిజా షెట్టర్ జంట, మణిరత్నం మాయాజాలం, పి.సి. శ్రీరామ్ కెమెరా పనితనం, ఇళయరాజా సంగీతం కలిసి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా మంచు ముసుగులో కనిపించే ఊటీ అందాలు, మౌనాన్ని కూడా భావోద్వేగంగా మార్చిన మణిరత్నం టేకింగ్ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. 

'ఓ ప్రియా ప్రియా', 'ఓ పాపా లాలి'వంటి పాటలు అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలకు ముందే సౌండ్‌ట్రాక్ భారీ ఆదరణ పొందింది. సినిమా వంద రోజులకు పైగా ప్రదర్శించబడటంతో పాటు జాతీయ అవార్డు, పలు నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో నాగార్జునకు యూత్‌లో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 

ALSO READ : బిగ్‌బాస్ 10లో హై వోల్టేజ్ డ్రామా.. హద్దుమీరిన అమన్-త్రిగుణ్ గొడవతో దద్దరిల్లిన హౌస్!

2025 నవంబర్ 14, 2026 ఆగస్టు 28 తేదీలు వాయిదా పడిన తర్వాత ఇప్పుడు నవంబర్ 13న కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. మెరుగైన పిక్చర్ క్వాలిటీ, రంగులు, శబ్దంతో 'గీతాంజలి' మరోసారి పెద్ద తెరపై అలరించేందుకు సిద్ధమైంది.