Nagarjuna100: ‘కింగ్ 100’ షూటింగ్ స్టార్ట్.. నాగ్ మైల్ స్టోన్‌‌ మూవీకి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

Nagarjuna100: ‘కింగ్ 100’ షూటింగ్ స్టార్ట్.. నాగ్ మైల్ స్టోన్‌‌ మూవీకి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌‌‌‌ మైల్ స్టోన్‌‌ మూవీకి సిద్దమయ్యాడు. గత కొన్ని నెలలుగా నాగ్ 100వ ప్రాజెక్ట్ గురించి చాలా వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. ఇపుడు సమయం ఆసన్నమైంది. అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం: కింగ్ నాగార్జున 100వ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం సోమవారం (అక్టోబర్ 6న) జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇవాళ బుధవారం (అక్టోబర్ 8) నుంచి షూటింగ్ స్టార్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఇటువంటి మైల్ స్టోన్ మూవీస్ చాలా పెద్దఎత్తున గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఉంటుంది. కోలాహలానికి భిన్నంగా, నిరాడంబరంగా షూటింగ్ ప్రారంభించాలని నాగ్ ఎంచుకున్నారని తెలుస్తోంది.

నాగార్జున కంటే ముందు చిరంజీవి మరియు బాలకృష్ణ మాత్రమే 100 సినిమాల మార్కును దాటారు. ఇపుడు నాగార్జున వంతు రావడంతో 100వ మూవీ కథ, టెక్నీషియన్స్ వంటి వివరాలపై ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో లేటెస్ట్గా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రివీల్ అయ్యాయి. 

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ తెరకెక్కిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. యాక్షన్‌‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో నాగ్‌‌తోపాటు నాగచైతన్య, అఖిల్ కూడా కీలక పాత్రలు పోషించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడని టాక్. తన 100వ మూవీకి దేవి అయితేనే పర్ఫెక్ట్ అని నాగ్ భావించినట్లు సమాచారం.

నాగార్జున-దేవి శ్రీ ప్రసాద్: నాగార్జున కెరీర్ సూపర్ హిట్ మూవీ మన్మధుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. ఇప్పటికీ, దేవి ఇచ్చిన ట్యూన్స్ ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తుండటం విశేషం. అలాగే, దేవీ-నాగ్ కలయికలో వచ్చిన మాస్, కింగ్, ఢమరుఖం, కుబేరా సినిమాలు సాంగ్స్ పరంగా మెప్పించాయి. ఇపుడీ నాగ్100 మూవీకి, దేవి ఎలాంటి ట్యూన్స్ ఇవ్వనున్నాడనేది ఆసక్తిగా మారింది. మిగిలిన నటీనటులు, టెక్నీకల్ టీమ్ వివరాల్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

‘కింగ్‌ 100 టైటిల్‌‌’:

నాగార్జున 100వ సినిమాకి మొన్నటి వరకు ‘కింగ్‌‌ 100 నాటౌట్‌‌’ అనే టైటిల్‌‌ ప్రచారంలో ఉంది. లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే..ఈ చిత్రానికి మరో టైటిల్‌‌ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ కథకు లాటరీకు సంబంధం ఉందని అందుకే ‘లాటరీ కింగ్’ అనే పేరును ఫైనల్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

డైరెక్టర్ కార్తీక్..:

డైరెక్టర్ కార్తీక్.. గతంలో తమిళంలో ‘నితం ఓరువానం" చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు. కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్‌కి బాగా నచ్చిండంతోనే వందో మూవీ బాధ్యతలు అప్పగించినట్లు సినీ వర్గాల్లో టాక్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karthik R (@rakarthik_dir)

డైరెక్టర్ కార్తీక్.. ఓజీ బ్యూటీ ప్రియాంక లీడ్ రోల్‌‌‌‌లో ఓ మూవీ తెరకెక్కించారు. ఓటీటీ కోసమే తీసిన ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఇది. రైజ్ ఈస్ట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కావచ్చి నట్టు తెలుస్తోంది. త్వరలోనే నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో ఇది స్ట్రీమింగ్‌‌‌‌ కానుంది.