నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌

V6 Velugu Posted on Mar 16, 2021

నాగార్జునసాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం(EC). ఏప్రిల్‌ 17న  ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి  ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు EC తెలిపింది. మే 2న ఓట్ల లెక్కింపుతో పాటు... అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఈ నెల 30 గా నిర్ణయించారు. మార్చి 31 నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహులు చనిపోవడంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఏపీలో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది.

Tagged nagarjuna sagar

Latest Videos

Subscribe Now

More News