నషా ముక్త్ భారత్ యాత్రకు నాగార్జున మద్దతు..నవంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో భారీ వాక్

నషా ముక్త్ భారత్ యాత్రకు నాగార్జున మద్దతు..నవంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో భారీ వాక్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ యాత్రకు హీరో అక్కినేని నాగార్జున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నాగార్జునతో సమావేశమైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈ వాక్‌‌‌‌‌‌‌‌లో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి యాత్ర టీ-షర్టులను ఆవిష్కరించారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజం కోసం జరిగే ఇలాంటి కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.