- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో వచ్చే నెల14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘బీసీ జనభేరి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ గురువారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను బీసీ సంఘాల నేతలు కలిసి ఆహ్వానించారు. జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.
అనంతరం గాంధీభవన్ వద్ద జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు, కోట్లాది మంది ప్రజలు గత ఆరు నెలలుగా మొరపెట్టుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఓబీసీ ప్రధాని ఉన్నప్పటికీ ఓబీసీలకు న్యాయం జరగడం లేదని, బీసీ కులాల లెక్కలు తీయకుండా కేంద్రం వారి హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.
