తెలంగాణకు మరో ఏఐసీసీ కార్యదర్శి 

తెలంగాణకు మరో ఏఐసీసీ కార్యదర్శి 
  • సీమన్ అలెక్స్ సరన్‌‌‌‌ కు బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు మరో ఏఐసీసీ కార్యదర్శిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. సీమన్ అలెక్స్ సరన్‌‌‌‌ను ఈ పదవిలో నియమిస్తూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శిగా సచిన్ సావంత్ కొనసాగుతుండగా, ఆయనకు తోడుగా సీమన్ అలెక్స్ సరన్ పనిచేయనున్నారు.

మరోవైపు, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు అజమత్ హుసేన్‌‌‌‌కు కర్నాటక, కుసుమ కుమార్‌‌‌‌కు ఒడిశా బాధ్యతలు అప్పగించారు. కొలుకొండ సంతోష్‌‌‌‌ను జాతీయ సందేశ్ ట్రైనింగ్ సెల్ కార్యదర్శిగా నియమించారు. ఇటీవలే తెలంగాణ పార్టీ కొత్త ఇన్‌‌‌‌చార్జిగా బీఎం సందీప్‌‌‌‌ను హైకమాండ్ నియమించింది. ఆయన శనివారం రాష్ట్రానికి రానున్నారు. ఆయన రాకకు ముందే మరో ఏఐసీసీ కార్యదర్శిని నియమించడంతో రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతంపై అధిష్ఠానం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.