అభివృద్ధి పనులను స్పీడప్చేయాలి.. నాగర్ కర్నూల్ జిల్లాలో కలెక్టర్ సమీక్ష

అభివృద్ధి పనులను స్పీడప్చేయాలి.. నాగర్ కర్నూల్ జిల్లాలో కలెక్టర్ సమీక్ష
  •    కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ టౌన్/లింగాల, వెలుగు :  నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. మొదట కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన జిల్లా ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ‘మన ఇసుక – మన వాహనం’ పోర్టల్‌‌‌‌లో నమోదైన వాహనాలకే రవాణా అనుమతులు ఇవ్వాలని, అక్రమ రవాణాను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. 

అనంతరం లింగాల మండలంలో ఆకస్మికంగా కలెక్టర్​ పర్యటించారు. సురాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి, పనులు ఉదయం 5:30 గంటలకే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

 మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే జనగణన-2027 ఇండ్ల సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రజలు ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.