బర్లను తోలుకొచ్చి.. పేడ నీళ్లు చల్లి రైతులు నిరసన.. ఎందుకంటే..!

బర్లను తోలుకొచ్చి.. పేడ నీళ్లు చల్లి రైతులు నిరసన.. ఎందుకంటే..!
  • యూరియా పంపిణీ నిలిపేసిన అధికారులు 
  • ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతుల వినూత్న నిరసన 

కోడేరు, వెలుగు: నాగర్​కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. గురువారం గ్రామ రైతు వేదికకు యూరియా పంపిణీని అధికారులు చేపట్టారు. రైతులు అధికసంఖ్య లో తరలిరావడంతో యూరియా పంపిణీని బంద్ పెట్టి తాళం వేశారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బర్లను తోలుకుని వచ్చి..  పేడ నీళ్లను చల్లి నిరసన తెలిపారు. రైతులు శాంతించిన తర్వాత యూరియా పంపిణీ ప్రారంభించారు. యూరియా తీసుకెళ్లిన రైతులే మళ్లీ వచ్చి గొడవ చేస్తున్నారని, తట్టుకోలేక బంద్ పెట్టామని ఏవో శిరీష తెలిపారు. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన స్టాక్ అందుబాటులో ఉందని చెప్పారు.