నాగోల్ ఎస్టీపీ ట్రయల్ రన్ షురూ

నాగోల్ ఎస్టీపీ ట్రయల్ రన్ షురూ

హైదరాబాద్, వెలుగు : నాగోలులో నిర్మించిన ఎస్టీపీని నెలాఖరు లోగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎస్టీపీని సందర్శించారు. వెట్ వెల్ దగ్గర ఇన్ లెట్ పంపులను స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్​రెడ్డి ఎస్టీపీ ప్రాంగణంలో పర్యటించి సీసీ రోడ్లు, లైటింగ్ పనులను పరిశీలించారు. అంతర్గత రోడ్ల నిర్మాణం సహా ముగింపు దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

ఎస్టీపీ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో ల్యాండ్ స్కేపింగ్, పూల మొక్కలతో బ్యూటిఫికేషన్​చేపట్టాలని సూచించారు. అధికారులతో కలిసి మొక్క నాటారు. కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్-2 సుదర్శన్, సీజీఎం, జీఎం, ఎస్టీపీ ఇతర అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.