నాగ్పూర్లో సోలార్ ప్లాంట్లో అగ్నిప్రమాదం.. ఆర్డీఎక్స్ పేలి చెలరేగిన మంటలు

నాగ్పూర్లో సోలార్ ప్లాంట్లో అగ్నిప్రమాదం.. ఆర్డీఎక్స్ పేలి చెలరేగిన మంటలు

మహారాష్ట్రలో నాగ్ పూర్ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురువారం (సెప్టెంబర్4) తెల్లవారు జామున నాగ్ పూర్ లో సమీపంలో చందూర్ లో సోలార్ ప్లాంట్ లో ఆర్డీఎక్స్ యూనిట్ పేలుడు సంభవించింది. దీంతో ప్లాంట్ లో పనిచేసే కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

ఈ ప్రమాదంలో కార్మికుడు మృతిచెందగా.. 9మందిరి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కాంపెనీలో నైట్ షిఫ్టులో దాదాపు 6వేల మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని  స్థానిక  ఆస్పత్రులకు తరలించారు. 

సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు,రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలిసిరాలేదు.