హిందువుల పండుగలలో నాగుల చవితికి ప్రత్యేక స్థానం ఉంది. నాగదేవతను పూజిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్షంలో చవితి రోజున ( అక్టోబర్ 25) ఈ పండుగను జరుపుకుంటారు. నాగేంద్రుడికి పాలు .. నువ్వులు మరియి బెల్లం.. చలివిడి సమర్పిస్తారు. 2025లో ఎప్పుడు జరుపుకోవాలి? పూజకు శుభ ముహూర్తం, చేయాల్సిన పనులేమిటో తెలుసుకుందాం
నాగులచవితి పండుగ రోజున పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. సిటీలో పుట్టలు ఉండవు కాబట్టి.. దేవాలయాల్లోని నాగుపాముల ప్రతిమలకు పాలాభిషేకం చేస్తారు.
ఈ ఏడాది ( 2025) నాగుల చవితి పండుగను అక్టోబర్ 25వ తేదీ జరుపుకోనున్నారు.
- చవితి తిథి ప్రారంభం : అక్టోబర్ 25 తెల్లవారుజామున 01.19 గంటలకు
- చవితి తిథి ముగింపు: అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున 03.48 గంటలకు
- పుట్టలో పాలు పోసేందుకు శుభ ముహూర్తం: అక్టోబర్ 25వ తేదీ ఉదయం 08.59 గంటల నుంచి 10.25 గంటల వరకు
నాగుల చవితి పండుగ రోజు భక్తులు పుట్టలో ఆవు పాలతో పాటు కొంతమంది గుడ్లు వేస్తారు. చలిమిడి, చిమ్మిరి నైవేద్యంగా చేసి నాగదేవతకు సమర్పిస్తారు. అలాగే జంట నాగుల విగ్రహాలకు పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తారు. మహిళలు సౌభాగ్యం కోసం, సంతానప్రాప్తి కోసం సర్పపూజ చేస్తారు. నాగుల చవితి రోజు నాగదేవతను పూజించడం వల్ల రాహువు గ్రహం దుష్ప్రభావాలు..కుజ దోషం, కాల సర్ప దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని పండితుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులకు సంబంధం లేదు.
