
శ్రీలంకతో మంగళవారం (జూన్ 17) గాలే వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో రాణించింది. తొలి సెషన్ లోనే శ్రీలంక బౌలర్లు విజృంభించి మూడు వికెట్లు తీసినప్పటికీ.. చివరి రెండు సెషన్ లలో లంక క్రికెటరలకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రీజ్ లో నజ్ముల్ హుస్సేన్ శాంటో ( 135), ముష్ఫికర్ రహీం (112) ఉన్నారు. లంక బౌలర్లలో తరిందు రత్నాయకే రెండు, అసిత ఫెర్నాండో ఒక వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బాంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే బంగ్లా ఓపెనర్ అనముల్ హక్ వికెట్ కోల్పోయింది. అసిత ఫెర్నాండో బౌలింగ్ లో డకౌటయ్యాడు. మోమినుల్ హక్, షాద్మాన్ ఇస్లాం స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. వీరిద్దరిని స్పిన్నర్ తరిందు రత్నాయకే పెవిలియన్ కు చేర్చాడు. దీంతో బంగ్లాదేశ్ 45 పరుగులేక్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీం ఆదుకున్నారు. లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదర్కొంటూ జట్టును ముందుకు నడిపించారు.
ఈ క్రమంలో ఇద్దరూ సెకండ్ సెషన్ లో తన హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అంతేకాదు వీరి భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. మూడో సెషన్ లో కూడా లంకకు నిరాశ తప్పలేదు. పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించడంతో శాంటో, ముష్ఫికర్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. అలవోకగా బౌండరీలు బాదుతూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్ కు వీరిద్దరి జోడీ అజేయంగా 247 పరుగులు జోడించడం విశేషం. ఎంత ప్రయత్నించినా లంక బౌలలు ఈ జోడీని విడగొట్టలేకపోయారు.
Najmul Hossain Shanto and Mushfiqur Rahim smashed stylish centuries as Bangladesh ended the opening day on a high 🔥#SLvBAN 📝: https://t.co/FVvOYQ8l3q pic.twitter.com/X91BjgmBjR
— ICC (@ICC) June 17, 2025