గోషామహల్లో కుంగిన పెద్ద నాలా

గోషామహల్లో కుంగిన పెద్ద నాలా

గోషామహల్లోని చాక్నవాడిలో పెద్ద నాలా కుంగిపోయింది. రోడ్డు కింద ఉన్న నాలా కుంగిపోవడంతో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అందులో పడిపోయాయి. ప్రతి శుక్రవారం బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేస్తారు. దీంతో కూరగాయలు ఇతర వస్తువులు కొనేందుకు చాలా మంది జనం అక్కడకు వచ్చారు. అదే సమయంలో నాలా కుంగడంతో కూరగాయల దుకాణాలతో పాటు జనం అందులో పడిపోయారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 

40 ఏండ్ల క్రితం నాలాపై రోడ్డు వేశారని,  ట్రాన్స్ పోర్ట్, టింబర్ డిపోల నుంచి లారీలు ఓవర్ లోడ్ తో తిరుగుతుండటమే రోడ్డు కుంగిపోవడానికి కారణమని స్థానికులు అంటున్నారు. దీనిపై అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. మార్కెట్ జరిగే రోజు కావడంతో సాయంత్రం సమయంలో నాలా కుంగి ఉంటే పెను ప్రమాదం జరిగేదని అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రమాదానికి సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.