నల్లగొండ పట్టణంలోని ఆలయాల్లో హుండీలు దొంగిలిస్తున్న వ్యక్తి అరెస్టు

నల్లగొండ పట్టణంలోని ఆలయాల్లో హుండీలు దొంగిలిస్తున్న వ్యక్తి అరెస్టు

నల్గొండ అర్బన్, వెలుగు : నల్లగొండ పట్టణంలోని పలు దేవాలయాల్లో హుండీ దొంగతనాలతో పాటు ఆటోలు, స్కూటీలు, సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లను అపహరిస్తున్న పాత నేరస్తుడు పొలిశెట్టి కార్తీక్ కుమారస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. సావర్కర్ నగర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడిన నిందితుడు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చింతల్ ప్రాంతానికి చెందినవాడని గుర్తించారు. 

అతడిపై నల్లగొండ, సంగారెడ్డి, జీడిమెట్ల, ఖమ్మం, మహబూబాబాద్, గుంటూరు జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 10కి పైగా చోరీ కేసులు నమోదై ఉన్నాయని, గతంలో మూడుసార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి ఒక స్కూటీ, ఆటో, రెండు సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించే రాడ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాఘవరావు, ఎస్సై ఎర్ర సైదులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.