నల్గొండ అర్బన్, వెలుగు: ఐఐటీ జేఈఈ మెయిన్స్2026 ఫలితాల్లో నల్గొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కాలేజీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు చైర్మన్ చందా కృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ.నరేందర్ బాబు, ఎన్. శశిధర్ రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేశ్ రెడ్డి తెలిపారు.
కళాశాలకు చెందిన విద్యార్థులు డి. అభిషేక్ 97.69, పి. భువిశ్రీ 96.01. యన్. దీక్షిత్ 95.40, సి. హెచ్. రామ్ చరణ్ తేజ్ 95.21, టి.రిషి 94.81, శివాంజన్రెడ్డి 94.03, తేజ్వీర్ 93.24, సాత్విక్ 92.38. యమ్. సుఫియాన్ 91.49, చందా సుహాస్ 91.48, ఎమ్. మనోహర్ ముత్యమ్ 90.94, కె. సాయికుమార్ 90.37 పర్సన్టైల్ సాధించారు. కళాశాలకు చెందిన 92 మంది విద్యార్థులు 80 పైగా పర్సంటైల్ సాధించినట్లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ప్రగతి జూనియర్ కళాశాల ది బెస్ట్ కాలేజీ అని నిరూపించినారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కాలేజీ విద్యార్థులను వారి తల్లిదండ్రులను అందుకు సహకరించిన లెక్చరర్ బృందానికి చైర్మన్, డైరెక్టర్లు మంగళవారం అభినందించారు.
