నల్గొండ, వెలుగు: ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తిస్థాయి అప్రమత్తతతో పనిచేస్తుందని జిల్లాఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిసరాల్లో భద్రతను బలోపేతం చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు. కలగకుండా చూడాలని, పెళ్లిళ్ల సమయంలో, ఆస్పత్రికి వెళ్లే వారి విషయంలో ఉదాసీనతతో వ్యవహరించాలని, నగదు, మద్యం పట్టుబడితే వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి , గృహ నిర్మాణ సంస్థ పీడీ రాజకుమార్, జడ్పీ సీఈఓ బి. శ్రీనివాసరావు, ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నారు.
