గిరిజన సంక్షేమ శాఖలో రచ్చకెక్కిన విభేదాలు

గిరిజన సంక్షేమ శాఖలో రచ్చకెక్కిన విభేదాలు
  • డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుట్టు బయట పెడుతున్నాడంటున్న వార్డెన్లు
  • కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, డీటీడీవోకు ఫిర్యాదు
  • హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకపోతే విధులు బహిష్కరిస్తామని వార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • సొంత ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నారంటున్న ఏవో

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో వార్డెన్లు, ఏవో మధ్య కొంతకాలంగా ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరుగుతున్న గొడవలు కాస్తా ప్రస్తుతం బహిర్గతం అయ్యాయి. హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవహారాల్లో ఏవో మితిమీరి జోక్యం చేసుకుంటుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వార్డన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏవోను వెంటనే హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకపోతే మూకుమ్మడిగా విధులు బహిష్కరిస్తామని వార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఈ మేరకు హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి, డీటీడీవో రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అయితే గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కూడా ఎంక్వైరీ చేయాలని ఏవో తరపు ఉద్యోగులు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇస్తున్నారంటున్న వార్డెన్లు

హాస్టల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏ చిన్న సమస్య తలెత్తినా బయటకు లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇవ్వడమే కాకుండా, కుల, విద్యార్థి సంఘాలతో ఆర్టీఐ లెటర్లు పెట్టిస్తూ ఏవో తమను మానసికంగా వేధిస్తున్నారని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యక్తిగత సమాచారంతో పాటు, సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాపీలు బయటకు ఇస్తున్నారని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీఐని అడ్డం పెట్టుకొని కుల, విద్యా్ర్థి సంఘాల లీడర్లు తమను బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఏవో గతంలో పనిచేసిన జిల్లాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం వల్లే నల్గొండకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారని, అతడిని జనగామకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా రిలీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా ఇక్కడే పనిచేస్తున్నారని వార్డెన్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సొంత ప్రయోజనాల కోసమే డ్రామా..

వార్డెన్లు తమ సొంత ప్రయోజనాల కోసమే డ్రామా ఆడుతున్నారని ఏవో జాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు ఉద్యోగులు చెపుతున్నారు. టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీవో, వార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘాలు ఏకమై తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, ఇక్కడి నుంచి బలవంతంగా పంపించి, వాళ్లకు అనుకూలమైన ఏవోను తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏవో జాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెపుతున్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ, ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి జనగామ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించారని, దీంతో తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. గతంలో నల్గొండలో సూపరిండెంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన ఓ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సూర్యాపేటలో పనిచేస్తున్నాడని, అతడిని మళ్లీ నల్గొండకు రప్పించేందుకే వార్డెన్లు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని ఉద్యోగులు చెప్తున్నారు.  

గొడవలకు అడ్డగా సంక్షేమ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆఫీసర్లు, ఉద్యోగుల మధ్య గొడవలకు సంక్షేమ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్డాగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు కలిసి ఆఫీసర్లపై పెత్తనం చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఇటీవల సహకార శాఖ అధికారిని ఇక్కడి నుంచి తప్పించారని పలువురు అంటున్నారు. ఇప్పుడు వార్డెన్లు, ఏవోకు నచ్చజెప్పాల్సిన సంఘాల లీడర్లు కుటుంబాలను రోడ్డుకు ఈడుస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, వార్డెన్లకు మధ్య గొడవలు జరుగుతుండడంతో ఇటీవల జిల్లా ఆఫీసర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఇక్కడి పనిచేసిన డీటీడీవోను ఆ పోస్టు నుంచి తప్పించి హౌజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీడీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి డీటీడీవోగా నియమించారు. డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం వల్లే ఉద్యోగుల మధ్య సఖ్యత లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏవోను హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకుంటే విధులు బహిష్కరిస్తామని వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు గామయ్య, వార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాలకృష్ణ, సెక్రెటరీ కె. లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.