భగీరథపై అలర్ట్!.. నల్గొండ గ్రామాల్లో రెండు, మూడు రోజులకోసారి కృష్ణా జలాలు సప్లై

భగీరథపై అలర్ట్!.. నల్గొండ గ్రామాల్లో రెండు, మూడు రోజులకోసారి కృష్ణా జలాలు సప్లై
  •     పలు చోట్ల మధ్యలోనే ఆగిపోయిన ట్యాంకులు, పైప్​లైన్ల పనులు
  •     జిల్లా మంత్రులు సమీక్షించక ముందే అప్రమత్తమైన అధికారులు
  •     మిషన్​ భగీరథ, పంచాయతీ సిబ్బందితో గ్రామాల్లో సర్వే

నల్గొండ, వెలుగు: మిషన్ భగీరథ నీటి సరఫరాపై జిల్లా యంత్రాంగం అలర్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యింది.  ఉమ్మడి జిల్లాలో అమలవుతున్న స్కీంలు, పెండింగ్ పనులపై కాంగ్రెస్​ప్రభుత్వం వరుస సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నలమాద ఉత్తమ్​ కుమార్​ రెడ్డి గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జిల్లాలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. త్వరలోనే జిల్లా అధికారులతో సమీక్షించనుండడంతో కలెక్టర్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ కర్ణన్ అధికారులను అప్రమత్తం చేశారు. మిషన్​ భగీరథ, పంచాయతీ సిబ్బందితో నీటి సరఫరాపై గ్రామాల్లో సమగ్ర సర్వే చేయిస్తున్నారు. అయితే అధికారులు చెబుతున్న దానికి, ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సమస్యకు పొంతన ఉండడం లేదు. 

రెండు శాఖలతో గ్రామాల్లో సర్వే

జిల్లాలో 1700 ఆవాసాలు ఉన్నాయని భగీరథ అధికారులు చెబుతుండగా, పంచాయతీ శాఖ 1300  ఆవాసాలు ఉన్నాయని అంటోంది. చివరగా 1600 వరకు అవాసాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు. అన్ని ఆవాసాలకు భగీరథ నీళ్లు సప్లై అవుతున్నాయా..?  లేదా..? తెలుసుకునేందుకు డీపీవో, భగీరథ ఇంజినీర్లు గ్రామాల్లో వేర్వేరుగా సర్వే చేసి రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. ఈ మేరకు 99 శాతం మేర గ్రామాల్లో భగీరథ నీళ్లు వస్తున్నాయని పంచాయతీ సిబ్బంది చెప్పినట్టు తెలిసింది. కానీ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో పరిశీలిస్తే నకిరేకల్, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది.  దీనిపై దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్​ ఇటీవల రివ్యూ కూడా చేశారు.  

రెండు, మూడురోజులకోసారి వాటర్ సప్లై 

నకిరేకల్​మండలం తాటికల్​శివారులోని దొండబండగూడెంలో కృష్ణా వాటర్ సప్లై చేసే గ్రిడ్​ లైన్ తెగిపోయింది. దీంతో మండలంలోని ఓగోడు గ్రామంలో మూడు వాటర్​ట్యాంకులు ఉన్నా ఒక్క ట్యాంకులోకి మాత్రమే నీళ్లు వస్తున్నాయి. కొండమల్లేపల్లి మండలంలోని పలు గ్రామాలకు వంతుల వారీగా నీటిని సప్లై చేస్తున్నారు. పలు గ్రామాలు, తండాలకు పైప్​ లైన్ల సమస్యతో నీళ్లు సరిగ్గా రావడం లేదు. దీంతో బోరు నీటిని వాడుతున్నారు.

చిన్నఅడిశర్లపల్లి, కోలుముంతల్ పహాడ్, రాముని గుండ్ల తండా, దంజీలాల్ తండా, ఉమ్మడి చెన్నారం గ్రామాల్లో నీటి కొరత ఉంది. అన్ని ఇళ్లకు నల్లాలు బిగించకపోగా, పైప్​లైన్ల పనులు మధ్యలోనే ఆపేశారని గ్రామస్తులు చెబుతున్నారు.  ఫ్లోరైడ్​ప్రభావిత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గంలో బోరునీళ్లు, భగీరథ నీళ్లు మిక్స్​చేసి వస్తున్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట, డిండి మండలాల్లోని గ్రామాలకు 80 కి.మీ దూరంలోని నర్సర్లపల్లి నుంచి వాటర్​ సప్లై జరుగుతుండడంతో పైప్​లైన్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా మూడు రోజుల వరకు కూడా నీళ్లు రావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. 

హాలియా పరిధిలో.. 

హాలియా మున్సిపల్ పరిధిలోని 2, 3,6 వార్డుల్లో గత కొన్ని నెలలుగా తాగునీరు అందక జనాలు ఇబ్బంది పడుతున్నారు. రెండో వార్డులోని సంతోష్ నగర్​లో నాలుగేళ్ల కింద హై లెవెల్ వాటర్ ట్యాంక్ నిర్మించారు. కానీ ఇప్పటివరకు ఆ ట్యాంకుకు భగీరథ పైప్ లైన్ కు కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో గత నాలుగేళ్ల నుంచి సంతోష్ నగర్, న్యూ ఇబ్రహీంపేట కాలనీలో  భగీరథ నీళ్లు రావడం లేదు. ఎస్సీ కాలనీలో సైతం తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలనీకి సరిపడా వాటర్ ట్యాంకులు నిర్మించలేదు.  ఆరో వార్డులోని హైస్కూల్లో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. దాని స్థానంలో కొత్త ట్యాంకు నిర్మించకపోవడంతో రెండేళ్ల నుంచి స్థానిక ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.

నీళ్లు సరిగ్గా వస్తలేవు


భగీరథ నీళ్లు సరిగా వస్తలేవు. పాత నల్లాల ద్వారానే నీళ్లు ఇస్తుండడంతో ఉప్పుగా ఉంటున్నయి. అవికూడా మూడు నాలుగు రోజులకోసారి మాత్రమే ఇస్తున్నరు. శివాజీ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాత వాటర్ ట్యాంకులోకి నీళ్లను నింపి ఇండ్లకు వదులుతున్నారు.  ఆ నీళ్లలో కూడా పురుగులు వస్తున్నయి.
- లింగమ్మ, శివాజీనగర్​, నకిరేకల్​ 

అన్ని గ్రామాలకు నీళ్లిస్తున్నం

నీటి కొరత లేదు. అన్ని గ్రామాలకు ప్రతి రోజు వాటర్​ సప్లై జరుగుతోంది. ఎక్కడైనా పైప్​లైన్ల సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తున్నం. కొన్ని చోట్ల కృష్ణా వాటర్​ మి క్స్​ అవుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.  మునుగోడు లాంటి ఫ్లోరైడ్​ ప్రాంతాల్లో నీటి పరీక్షలు చేయిస్తున్నం.  
‌‌‌‌ - వెంకటేశ్వర్లు, భగీరథ ఎస్ఈ