న్యాయ పరిశోధన కోసం నల్సార్ వర్సిటీ కృషి చేస్తుంది

న్యాయ పరిశోధన కోసం నల్సార్ వర్సిటీ కృషి చేస్తుంది

శామీర్ పేట, వెలుగు : అంతర్జాతీయ న్యాయ పరిశోధన కేంద్రంగా నల్సార్ యూనివర్సిటీ ముందుకు సాగుతున్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల కేంద్రంలోని నల్సార్ లా యూనివర్సిటీలో  రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన ‘బీపీ జీవన్ రెడ్డి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ లా సెంటర్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.  అంతర్జాతీయ న్యాయ చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయ పరిశోధన కోసం నల్సార్ వర్సిటీ కృషి చేస్తున్నదన్నారు.

ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్  బీపీ జీవన్ రెడ్డిని అభినందించారు. దాతలు ముందుకు వచ్చి అంతర్జాతీయ న్యాయ చట్టాల అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. నల్సార్ వర్సిటీ ఇన్ చార్జి వీసీ వి. బాలకృష్ణారెడ్డి, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ లా సెంటర్ డైరెక్టర్ పీఎస్ రెడ్డి పాల్గొన్నారు.