
2019 కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరగలేదని అన్నారు టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు. మోడీ నాయకత్వం లో రెండవసారి ఏర్పడిన ప్రభుత్వం అందరికీ న్యాయం చేసేలా బడ్జెట్ రూపొందిస్తుందని తాము అనుకున్నామని అయితే.. అందుకు విరుద్ధంగా ప్రస్తుత బడ్జెట్ ఉందని నామా అన్నారు. ‘హర్ ఘర్ జల్’ పేరుతో దేశంలోని అన్ని ఇండ్లకు నీళ్లను అందించనున్న పథకం… మిషన్ భగీరతను కేంద్రం కాపీ కొట్టిందని నామా నాగేశ్వరరావు చెప్పారు. కనీసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు ఆర్థిక సహాయం ఇస్తే తాము సంతోషించేవారమని ఆయన అన్నారు. బంగారం పై ట్యాక్స్ పెంచడం సామాన్యులకు ఇబ్బంది కలిగించే అంశమని నామా చెప్పారు.