TRS లోక్ సభా పక్ష నాయకుడిగా నామా నాగేశ్వరరావు

TRS లోక్ సభా పక్ష నాయకుడిగా నామా నాగేశ్వరరావు

TRS పార్లమెంటరీ పార్టీ సమావేశం… పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఇవాళ CM క్యాంప్ ఆఫీస్ లో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్ సభా పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపీ కె.కేశవరావును ఎన్నుకున్నారు. లోకసభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావును ఎన్నుకున్నారు. రాజ్యసభలో TRS పక్ష నాయకుడిగా కేశవరావును ఎన్నుకున్నారు.

రాజ్యసభలో టీఆర్ఎస్ విప్ గా జోగినిపల్లి సంతోష్ ఎన్నిక

లోకసభ, రాజ్యసభలలో ఒక్కో డిప్యూటీ లీడర్, ఒక్కో విప్ ను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. లోకసభ టిఆర్ఎస్ పక్ష ఉప నాయకుడిగా మెదక్ MP కొత్త ప్రభాకర్ రెడ్డి, విప్ గా జహీరాబాద్ MP B.B.పాటిల్ ఎన్నికయ్యారు. రాజ్యసభలో TRS పక్ష ఉప నాయకుడిగా బండ ప్రకాశ్, విప్ గా జోగినిపల్లి సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు.

లోక్ సభా పక్ష నాయకుడిగా ఎన్నికైన నామా నాగేశ్వరరావు…. మొన్నటివరకు సుదీర్ఘ కాలం టీడీపీలో కొనసాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చి ఖమ్మం నుంచి బరిలో దింపింది టీఆర్ఎస్. ఈ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచారు. టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకుడు అయ్యారు.