
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు దేవతామూర్తుల పేర్లను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. పంచాయతీ రాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం క్యాంపు ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు సీఎం. ఈ సందర్భంగా బ్యారేజీలకు దేవతల పేర్లు పెట్టారు.
మేడిగడ్డ బ్యారేజీకి లక్ష్మీ బ్యారేజీగా.. కన్నెపల్లి పంప్‌హౌస్‌కి లక్ష్మీ పంప్‌హౌస్‌గా నామకరణం చేశారు. అన్నారం బ్యారేజీకి సరస్వతి బ్యారేజీగా.. సిరిపురం పంప్‌హౌస్‌కు సరస్వతి పంప్‌హౌస్‌గా పేరు పెట్టారు. సుందిళ్ల బ్యారేజీకి పార్వతి బ్యారేజీగా.. గోలివాడ పంపుహౌస్‌కు పార్వతి పంపుహౌస్‌గా నామకరణం చేశారు. నంది మేడారం రిజర్వాయర్‌కు నంది పేరును లక్ష్మీపురం పంపుహౌస్‌కు గాయత్రిగా పేరు పెట్టారు సీఎం కేసీఆర్.