
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. మానస వారణాసి హీరోయిన్. ప్రశాంత్ వర్మ కథను అందించగా ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించాడు. సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ‘నమో ఈశ్వర’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
‘వ్యోమకేశ నిటలాక్ష నిశ్చలా.. పింగలాక్ష మదనారి అక్షరా.. ఆదియోగి అద్వైత భాస్కరా నమో ఈశ్వరా’ అంటూ సాగిన డివోషనల్ సాంగ్ ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాట ఈశ్వరుడి గొప్పతనం చాటేలా సాగింది. శ్రీనివాస మౌళి పత్రి లిరిక్స్ ఆధ్యాత్మిక భావాన్ని చాటాయి. స్వరాగ్ కీర్తన్ పాడిన విధానం ఆకట్టుకుంది. ఈ సాంగ్‌లో అశోక్ గల్లా ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది.