నాంపల్లిలో పార్కింగ్ కష్టాలకు చెక్.. ఈవీ ఛార్జింగ్ సౌకర్యంతో పజిల్ పార్కింగ్

నాంపల్లిలో పార్కింగ్ కష్టాలకు చెక్.. ఈవీ ఛార్జింగ్ సౌకర్యంతో పజిల్ పార్కింగ్

ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ లోని నాంపల్లి రోడ్డులో పార్కింగ్ కష్టాలు తీరనున్నాయి. దేశంలోనే తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్  అందుబాటులోకి వచ్చింది. AIతో నిఘా భద్రత, మనుషులతో పనిలేకుండా సెన్సార్ పార్కింగ్ సిస్టమ్, చార్జింగ్ కోస సోలార్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఈ మల్టిలెవల్ పార్కింగ్ సిస్టమ్ లో అందుబాటులో ఉన్నాయి. ఎంతో కాలంగా నాంపల్లి రైల్వే స్టేషన్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యకు ఈ ఏర్పాటు పరిష్కారం చూపునుంది. 

ఆదివారం(జవనరి25) నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. మొత్తం 15అంతస్తుల కాంప్లెక్స్ లో పది అంతస్తులలో మల్టిలెవల్ పార్కింగ్  కు ఐదు అంతస్తులలో షాపింగ్ మాల్స్ , సినిమా థియేటర్లతో అటు పార్కింగ్ రిలీఫ్, ఇటు షాపింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మూడు బేస్ మెంట్లలో 10 అంతస్తులలో వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. 250 కార్లు, 150నుంచి200 దాకా బైకులను పార్కింగ్ చేసుకోవచ్చు. 

రోబోటిక్ పార్కింగ్ సిస్టమ్, AI ఆధారిత నిఘా, సోలార్ శక్తితో , ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సదుపాయం ఈ కాంప్లెక్స్ అందుబాటులో ఉంది. ఎంతో కాలంగా నాంపల్లి రైల్వే స్టేషన్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యకు ఈ ఏర్పాటు పరిష్కారం చూపనుంది. 

పీపీపీ మోడల్  

రూ.150కోట్లతో ఈ ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రాజెక్టు ను పబ్లిక్, ప్రయివేట్ పార్టినర్ షిప్ (పీపీపీ) మోడ్ లో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. టెక్ ఫౌండర్ హరికిషన్ రెడ్డి, అతని భార్య భావన రెడ్డి యాజమాన్యంలోని  నోవమ్ కంపెనీ భాగస్వామ్యంలో ఆ ప్రాజెక్టును నిర్మించారు .

ఈ ప్రాజెక్టును బిజినెస్ పరంగా డెవలప్ చేసేందుకు షాపింగ్ మాల్స్ కోసం మరో ఐదు అంతస్తులను కేటాయించారు. 11వ అంతస్తులో రెండి సినిమా థియేటర్లు,గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఆటోమేటెడ్ పార్కింగ్  సిస్టమ్ పూర్తిగా సెన్సార్ల ద్వారా నడుస్తుంది.