
ఆ మూడు పార్టీలూ ప్రజలను మోసం చేస్తున్నయ్: ఫిరోజ్ ఖాన్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం బీ టీం అని నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. సొంత లాభం కోసం ఆ మూడు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఫైర్అయ్యారు. కవిత ఎపిసోడ్‌తో వారు కాంప్రమైజ్అయ్యారని, రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీని గెలిపించేందుకు ఒప్పందం చేసుకున్నారన్నారు.
బుధవారం ఆయన సనత్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోటా నీలిమతో కలిసి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పుట్టిన పార్టీ ఇక్కడ 10 స్థానాల్లో కూడా పోటీ చేయట్లేదని, అలాంటిది యూపీలో వంద స్థానాల్లో పోటీ చేస్తున్నదని ఎంఐఎంను విమర్శించారు. గోషామహల్లో రాజాసింగ్‌పై ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. అసదుద్దీన్, కేసీఆర్ చెప్పినోళ్లకే బీజేపీ టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు.