అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏండ్ల జైలు... నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏండ్ల జైలు... నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ సిటీ, వెలుగు: అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికను మోసగించి అత్యాచారం చేసిన కేసులో ఓ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 21 ఏళ్ల జనపాల అఖిల్‌‌ ఓ మైనర్ ను మోసగించి, గర్భవతిని చేశాడు. 

పోక్సో కింద కేసు నమోదు చేసి చాదర్​ఘట్ పోలీసులు నాంపల్లి మెట్రో పొలిటన్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 18 మంది సాక్షులను విచారించిన కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా, బాధితురాలికి రూ.8 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.