గౌతమ్ కోసం నమ్రత ఎమోషనల్ పోస్ట్

గౌతమ్ కోసం నమ్రత ఎమోషనల్ పోస్ట్

మహేశ్ బాబు భార్య  నమ్రతా ఎమెషనల్ అయ్యారు. తన కొడుకు గౌతమ్ తనను విడిచి ఫస్ట్ టైం ఫారెన్ టూర్ వెళ్తున్నాడంటూ ఇన్ స్టాగ్రాంలో  పోస్ట్ చేశారు. ‘గౌతమ్ నన్ను విడిచి ఫస్ట్ టైం ఫారిన్ కల్చరల్ ట్రిప్ కి వెళ్లాడు. నాలో ఓ భాగం దూరం అవుతున్న ఫీల్ వచ్చింది. దీన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. రోజంతా శూన్యంగా ఉంది. గౌతమ్ తిరిగి కళ్ల ముందు కనబడే వరకు ఈ బాధ తీరదు. మా బుజ్జి కన్నకు రెక్కలొచ్చి ఎగిరిపోయాడు. ఈ ట్రిప్ నీకు ఎన్నో అనుభవాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. నీ కోసం ఎదురుచూస్తూ ఉంటా’’ అని  నమ్రతా పోస్ట్ చేశారు. గౌతమ్ తన ఫ్రెండ్స్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.